
జనం న్యూస్ మే 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగు మహిళా నాయకురాలు బిజెపి నాయకులు సంతోషిమాత దేవస్థానం చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు తల్లి ఇటీవల గుండుపోటుతో స్వర్గస్తులయ్యారు. ఈ రోజున వారి స్వగృహంలో జరుగుతున్న పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సదరు కార్యక్రమంలో పాల్గొని నూకరత్నం చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ మారిశెట్టి నూకరత్నం 1999వ సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలు గవరపాలెం ప్రాంతంలో ఏర్పాటు కోసం విశేషమైన కృషి చేశారని, ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ దగ్గర పర్యవేక్షణ చేస్తూ ఇంటింటికి తిరిగి ఓటర్లను ఓటు వేసే విధంగా దగ్గరుండి పోలింగ్ బూత్ కి తీసుకువచ్చే వారిని, అటువంటి నాయకురాలు తెలుగుదేశం పార్టీకి లేని లోటు తీరనిదని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల వెంకటరావు శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ పెంటకోట వెంకటరమణ బుద్ధ ఈశ్వరరావు బుద్ధ జోగినాయుడు వారి కుటుంబ సభ్యులు నూకరత్నం భర్త శివ అప్పారావు కుమారులు భాస్కరరావు,హేమసుందర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.//