
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోగల తోటపాలెం రోడ్డు గుంతల మయంతో అద్వాన్న స్థితిలో ఉంది గతంలో సిమెంట్ రోడ్డు ప్రస్తుతం మెటల్.రోడ్డు కన్నా అధ్వాన్నంగా తయా
రయింది. ఈ మార్గాన గాంధీ నగర్, తోట పాలెం వాసులు రైల్వేస్టేషన్ జిల్లాపరిషత్ .క్రీడా మైదానంకు ఈ మార్గాన్నే వెళ్ళవలసి ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా ఎత్తుగా సిమెంట్ రోడ్లు వేయడంతో తోటపాలెం రోడ్డు గుంతగా మారి వర్షం వస్తే బురద నీరు నిలబడి పాదచారు లకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.కంకర రాళ్లు కూడా బయటపడ్డాయి కావున తోటపాలెం కు సిమెంట్.రోడ్డుమంజూరు చేయవలసిందిగా గాంధీనగర్, తోటపాలెం వాసులు కోరు తున్నారు.