
జనం న్యూస్ 11 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా బాధితులకు నష్టపరిహారంగా రూ. 30లక్షలు చెల్లించాలి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలిబి. కురుమన్న జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ గద్వాల మండల పరిధిలోని రేపల్లి గ్రామంలో మాదిగ కులానికి చెందిన రంగముని, బీసీ కులానికి చెందిన మహేశ్వరి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనే సమాచారంతో జీర్ణించుకోలేని మహేశ్వరి కుటుంబ సభ్యులు దళిత రంగముని ఇంటిపైకి వెళ్లి సుమారు 30-40 మంది ప్రోక్లైన్ ( జేసిబి ), గడ్డపారలతో ధ్వంసం చేయడం దుర్మార్గం, ఇళ్లు ధ్వంసం చేసిన బీసీ కులానికి చెందిన వారిని వెంటనే అరెస్టు వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకుని తమ ఇష్ట ప్రకారం కులాంతర వివాహం చేసుకుంటే కుల వివక్షత పేరుతో దాడులు సరికాదని విమర్శించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే దళితుల ఇళ్లు నేలమట్టం అయ్యేవి కాదని విమర్శించారు. ఇప్పటికైనా పోలీసులు తక్షణం స్పందించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన బాధితులకు 30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరారు అదేవిధంగా ప్రేమజంటకు మరియు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని అదేవిధంగా గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా బందోబస్త్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.