
జనం న్యూస్ జూలై 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట కి చెందిన సీనియర్ నాయకులు అంబటి శ్రీనివాసరావు తండ్రి దివంగత అంబటి మల్లేష్ మొదటి వర్ధంతి వేడుకలు అంబటి శ్రీనివాస్ నివాసంలో సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పాల్గొని మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, రామారాo శ్రీశైలం గౌడ్, సతీష్ గౌడ్, ఎండి గౌసుద్దీన్, నాయకులు సతీష్ అరోరా, పంచశీల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.