
జనం న్యూస్ ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముమ్మిడివరం నియోజకవర్గానికి కేటాయించిన ప్రత్యేక మోటారు వాహనాలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పర్యటనలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దివ్యాంగులు స్వావలంబనతో జీవించేలా, వారి ఉపాధి అవకాశాలు మరియు రాకపోకలు సులభతరం అయ్యేలా ఈ ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం అందజేస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమండ్ర విజయకుమార్ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.