
జనం న్యూస్ 30 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ఈరోజు ఉదయం ప్రజా పాలన కార్యక్రమంలో వికలాంగుల సాధికారత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రములో 36,000 అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి. అందులో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 1,440 అంగన్వాడీ టీచర్ మరియు 1,440 అయ్యా మహిళా వికలాంగులకు రావాలి అందులో ముఖ్యంగా అంగన్వాడి టీచర్ ఆయా ఉద్యోగులకు శారీరక మహిళా వికలాంగులు మాత్రమే అర్హులు కావాలంటే మహి ళ సంక్షేమ శాఖ2018 జివో ఇచ్చారు.కాబట్టి పున పరిశీలించి మహిళా శారీరక వికలాంగులకు న్యాయం చేయ గలరు.15,982 ఉద్యోగాలు పడాయి.అందులో 2016 వికలాంగుల హక్కుల చట్టం మహిళ వికలాంగులకు 4% రిజర్వేషన్ కలిపిస్తే 640 ఉద్యోగాలు వస్తాయి కచ్చితంగా కలిపించాలి. సమాజం లో అత్యంత వెనుక బడ వర్గం మహిళా వికలాంగుల వర్గం ఉద్యోగం లేక ఉపాధి లేక పెళ్లిళ్లు కాక తల్లిదండ్రులకు భారంగా సమాజానికి చిన్న చూపుగా ఉండలేక హాత్మ హత్య లకు పలుపడుతున్నారు. ఎన్నికల సమయం లో ఓటు గా గుర్తిస్తున్నారు తప్ప హక్కుగా గుర్తించలేరు. దయచేసి పెద్ద మనసుతో మా రిజర్వేషన్ కల్పించి మాతృహృదయం చూపగలరు. మహిళా వికలాంగుల సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కోల రాజ్యలక్ష్మి జనరల్ సెక్రటరీ స్వప్న సభ్యులు లక్ష్మి, రత్న సైదులు యాదవ్ తదితరులు ప్రజాభవన్లో ప్రజా పాలన కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది