
జనం న్యూస్ 20 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ ✍🏻 జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఘనంగా నిర్వహించ బడింది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ఈ కార్యక్రమంలోనాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సమావేశంలో గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్య సేవలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు త్వరితగతిన అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రజాప్రతినిధులు సూచించారు.పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.అనంతరం వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ శాంతినగర్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న పోస్టాఫీసును సబ్ పోస్టాఫీస్‌గా అప్‌గ్రేడ్ చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కి మరియు ఎమ్మెల్యే విజయుడు కి వినతిపత్రం అందజేశారు శాంతినగర్ ప్రాంతంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పోస్టల్ సేవలను మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని చైర్మన్ వివరించారు. దీనిపై ఎంపీ మరియు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.