
జనం న్యూస్, 2026, జూలై 7, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగంలోనిషెడ్యూల్డ్ కులముల, బాలుర వసతి గృహం ముందు, తడి, పొడి చెత్తకు సంబంధించిన వ్యర్ధాలు, పేరుకుపోయాయి. కొంతమంది గ్రామస్తులు,చెత్తను సేకరించే ట్రాక్టర్లో వేయకుండా, సంచుల్లో తీసుకొనివచ్చి, ఇక్కడే పరవేయడంతో, వ్యర్థాలు పేరుకుపోయి, దుర్వాసన వస్తుందని, హాస్టల్ విద్యార్థులు, స్థానికులు, ఈ దారిన పోయే ఇతర గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి, హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వారు పేర్కొన్నారు.