
జనం న్యూస్ జులై 9 2026 (ఎల్జతుర్తి మండల్ బండి కూనరస్వామి రీపోటర్ )హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి కరీంనగర్–హనుమకొండ జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాటు సాగునీటి కొరత తీవ్రంగా ఉందని అన్నారు. నీరు అందక వరి నారు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం రైతుల ఇబ్బందులను వెంటనే గుర్తించి, దేవాదుల ప్రాజెక్టు నుంచి సాగునీటిని చెరువు లకు కుంటలకు అత్యవసరంగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులే దేశానికి వెన్నెముక అని, వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.సాగునీరు లేక పంటలు నష్టపోతే రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటారని, రైతులకు అండగా నిలిచి పంటలను కాపాడేందుకు వెంటనే దేవాదుల నీటిని విడుదల చేయాలని కోరారు. రైతులను కనురెప్పలా కాపాడాలని, వారి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతు రక్షణ సమితి విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని, తమ పంటలకు వెంటనే సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సలహాదారుడు సుఖినో సుధాకర్ రావు మండల అధ్యక్షుడు కొక్కు తిరుపతి కోదాడ మాధవరావు రవీందర్రావు కుమార్ తదితరులు పాల్గొన్నారు