

జనం న్యూస్ జూన్ 17 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువులోని వి కన్వెన్షన్ హాల్లో సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసిన సందర్భంగా మేధావుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదల సంక్షేమం కోసం ఉచిత బియ్యం పంపిణీ, విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం, దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, అవసరమైన మందులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ, పునరుత్పాదక ఇంధన రంగంలో దేశాన్ని ముందుకు తీసుకువెళుతోందని వివరించారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మేధావులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, పూర్వపు అధ్యక్షులు యాళ్ళ దొరబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, గుంటూరు జిల్లా ఇంచార్జి తమనంపూడి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లు చీకరమెళ్ళి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కొప్పనాతి దత్తాత్రేయ, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, చిలకమర్రి కస్తూరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.