
జనం న్యూస్, 2026, జూలై 15, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామం, గ్రామ శివారు లోని, సర్వేనెంబర్ 126 లోని, పెద్దగట్టు పైన, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇందిరా జలప్రభ పథకం ద్వారా, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మరియు చిన్న, సన్నకారు రైతులకు, సాగునీరు అందించి, వారి భూములను సస్యశ్యామలం చేయడం కోసం, ఉచితంగా బోరుబావిని త్రవించి, 3 ఫేస్ కరెంటు కనెక్షన్ ఇచ్చి, కరెంటులో హెచ్చుతగ్గులు రాకుండా, నాణ్యమైన కరెంటును అందించడం కోసం, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఇట్టి ట్రాన్స్ఫార్మర్ను దొంగలు ధ్వంసం చేసి, ఇందులోని విలువైన సామాగ్రిని, మరియు గ్రామం నుండి, ట్రాన్స్ఫార్మర్ వరకు, విద్యుత్తు స్తంభాల ద్వారా సరఫరా చేసే, విద్యుత్తు తీగలను కూడావారు దొంగిలించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి, దొంగలను పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలని, రైతులను ఆదుకోవాలని రైతులు తెలిపారు.