
కడవేర్గు రాజనర్సు సిద్దిపేట
మున్సిపల్ మాజీ చైర్ పర్సన్
జనం న్యూస్ ; 4 సెప్టెంబర్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ బాలకృష్ణుడిగా గోపాలకృష్ణుడి లీలలు గొప్పవని, కృష్ణుడి మార్గంలో అందరు నడవాలని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు అన్నారు. అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిళ్ళ ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో రంగదాంపల్లి యాదవ సంఘంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలలో ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, పద్య కవి కాల్వ రాజయ్య సంపాదకీయంలో వెలువడిన కృష్ణం వందే జగద్గురుమ్ పుస్తకం మరియు ఉండ్రాళ్ళ రాజేశం రచించిన కృష్ణా! కృష్ణా! పాటను ఆవిష్కరించారు. అలాగే కృష్ణ పూజ చేసి, ఉట్టి కొట్టి అలరించారు. కార్యక్రమంలో రాజనర్సు మాట్లాడుతూ ధర్మం కోసం రాజీ పడకుండా నిలబడి విజయతీరాలకు చేర్చడమే శ్రీకృష్ణుని తత్వమని భారత చరిత్రలో యాదవుల కీర్తి శ్రీకృష్ణుడి అవతారంతో మరింత ఖ్యాతిగాంచిందని అన్నారు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచపోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు తత్వబోధ ద్వారా ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపే మార్గదర్శనం చేశాడని మనము ఆ సన్మార్గంలో నడిచి సత్యవాక్ పాలకులుగా ఎదగాలని సమాజ హితమే జాతి హితంగా భావించి జ్ఞానాన్ని ప్రేమను పంచి సర్వజనహితులుగా పేరుగాంచాలని ఆకాంక్షించారు , కృష్ణుడి ధర్మ బాటలో యాదవ జాతి నడవాలన్నారు. అఖిలభారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ కృష్ణుడు నడిచిన ధర్మ నీతి మార్గంలో యాదవులు నడవాలన్నారు. ప్రముఖ వైద్యులు మురళీకృష్ణ మాట్లాడుతూ కృష్ణ తత్వమే జగత్ రక్షణ అన్నారు. కొమురవెల్లి దేవస్థాన పూర్వ చైర్మన్ దువ్వాల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి యాదవుల ఇండలో కృష్ణ లీలలు కనిపిస్తాయని, చిన్నారులంతా గోపాలులన్నారు. కవి రచయిత ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ జగద్గురువు శ్రీకృష్ణుడు చూపిన మార్గం యాదవ జాతికి బీజమని, కృష్ణ చరితంపై ప్రతి సంవత్సరం పుస్తకాలు తీసుకురావడం సంతోషఅన్నారు. కార్యక్రమంలో బొల్లు రాముయాదవ్ , తిరుమల్ రెడ్డి, ప్రభాకర్ వర్మ, అరవింద్ రెడ్డి ముత్యాల కనకయ్య బైరి రాములు, దాసరిశ్రీనివాస్, రాగం రాగంసాయి, జంపెల్లి గిరి, దాసరిరాజు, కుక్కల తిరుపతి, గొర్రెమల్లికార్జున్, తలారిచంద్రశేఖర్, సంద బోయిన నాగరాజు, రాము, పరశురాములు, ఓజయ్య, మల్లేశం, ముల్కల కుంటయ్య గుండెల్ని వేణు చింతల శ్రీనివాస్ గంధం రాజు చింతల మల్లేశం జక్కుల రాజేశం పయ్యావుల రాములు యాదవ్ సత్యలక్ష్మి కాటుక నరసింహులు బైరి అనిల్ గొల్లరాజేశ్వర్ వేల్పుల అర్జున్ బొల్లు తిరుపతి పేరబోయిన శ్రీకాంత్ చింతల బాలనర్సు తదితరులు పాల్గొన్నారు.