
మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 28మే పెగడపల్లి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు పెగడపల్లి మండలంలోని రాజారాం పల్లి ఐకెపి వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ సందర్శించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందావద్దని అన్నారు అలాగే కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు
కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు ఒరుగల అరుణ- శ్రీనివాస్ ఐకెపి ఎపిఎం రవివర్మ,
స్థానిక ఉపసర్పంచ్ మహేందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగంపల్లి మహేష్ఐకేపీ సిసి స్వామి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ మిట్టపెల్లి లత
రైతులు పాల్గొన్నారు.