
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 04-06-26 నందలూరు మండలం - నియోజకవర్గ పార్టీ కార్యాలయం - రాజంపేట పట్టణం.రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందేలా చూడాలని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొ న్నారు.గురువారం నాడు నందలూరు నందు పర్యటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా చమర్తి జగన్ మోహన్ రాజు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రేమ పూర్వకంగా మాట్లాడి వైద్యంఅందించాలన్నారు.అంతకుముందు చమర్తి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన రోగులతో మాట్లాడి జగన్ మోహన్ రాజు ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆసుపత్రి వైద్యులు,స్థానిక ప్రజాప్రతి నిధులు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.