
జనం న్యూస్- మే 30- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోనీ మాచర్ల- హైదరాబాద్ ప్రధాన రహదారి పై తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు దిష్టిబొమ్మను తెలంగాణ వాదులు దహనం చేశారు, ఈనెల 27వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకుల మెప్పు పొందటానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని తెలంగాణ ప్రజల మనో భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని, ఇట్టి వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంత ప్రజలను తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినట్లేనని తెలంగాణ ఉద్యమ కారుల ఫారం నాయకులు అన్నారు. తెలంగాణ ప్రాంతం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బక్కని నరసింహులు పై చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎవరూ కూడా తెలంగాణ ప్రాంతంపై అగౌరవంగా మాట్లాడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడి అక్కడి నాయకుల ముందు తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు కాయితి జానకి రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు హీరేకర్ రమేష్ జి,నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బాణాల వేణుగోపాలరావు, హాలియా, పెదవుర మండలాల అధ్యక్షులు గోపిశెట్టి నరసింహారెడ్డి, నరసింహ, తెలంగాణ సత్యం, నందికొండ మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి నాయక్, బూషరాజుల కృష్ణయ్య, పందిళ్ళ సత్యనారాయణ, దేశీయ నాయక్, విజయ్, శివ నాగులు తదితరులు పాల్గొన్నారు.