
జనం న్యూస్ -ఆగస్టు 6- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస అధ్యక్షత వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు నటువ నరేందర్, చందూలాల్ నాయక్, మైలపల్లి జానకి, పగడాల నాగరాజు, కో ఆప్షన్ సభ్యులు కోటిరెడ్డి, నిమ్మలఇందిర, ముజీబ్ మరియు నందికొండ పురపాలిక కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.