
జనం న్యూస్ ఆగస్టు 9 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) *కాట్రేనికోన మండల, నడవపల్లి గ్రామంలో మాతృమూర్తులు, గ్రామస్తులు కలిసి గ్రామ దేవత నడవ పల్లి మ్మ, సత్తెమ్మ అమ్మవారికి ఊరి ఆడపడుచుగా భావించి ఆషాడ మాస సారెగా చలిమిడి, పానకం, చీర, రవికె, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శివ అర్చకులు బ్రహ్మాజీ, ఆచారి ప్రభు, శేషు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాడంలో సారె సమర్పించడం వల్ల వ్యాధులు నివారించి గ్రామస్తులను అమ్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడుతుందని, ఆచారాల వల్ల సమాజంలో మంచి వాతావరణం నెలకొని పిల్లలు నేర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షితుల రవణ, గ్రంధి నాని బాబు, నాగభూషణం, సత్తిబాబు, సూరిబాబు తదితరులు పాల్గొని సారె సమర్పించిన ఆడపడుచులకు అభినందనలు తెలిపారు.