
జనం న్యూస్ జూలై 25 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) కాట్రేనికోన :కాట్రేనికోన మండలం నడవపల్లి గండిగాని చెరువు గ్రామంలో ఆషాడ మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. గ్రామ దేవత శ్రీ నడవపల్లమ్మ, సత్తెమ్మ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారికి గ్రామస్తులు ఊరి ఆడపడుచుగా భావించి ఆషాడ సారె సమర్పించారు.ధార్మిక సమితి కన్వీనర్ బి. నాగలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలోని మాతృమూర్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవార్లకు చలిమిడి, పానకం, కొత్త చీర రవిక, పసుపు కుంకుమ, గాజులు, వివిధ రకాల స్వీట్లు మరియు పండ్లతో సారెను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఆచారాల ప్రాముఖ్యతను వివరించిన బొంతు కనకారావుఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ ఆషాడ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం ఎంతో విశిష్టమైనదని అన్నారు. ఈ కాలంలో ప్రబలే అనేక రకాల వ్యాధులను అమ్మవారి కృపతో నిరోధించవచ్చని, గ్రామస్తులను ఎల్లవేళలా కాపాడుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అమ్మ అందజేస్తుందని తెలిపారు.ఇటువంటి ధార్మిక కార్యక్రమాల వలన సమాజంలో మంచి వాతావరణం నెలకొంటుందన్నారు. మన ఆచార సంప్రదాయాలను మనం ఆచరిస్తుంటేనే పిల్లలు వాటిని నేర్చుకుంటారని, తద్వారా సంస్కృతి భావితరాలకు అందుతుందని సూచించారు.*గ్రంధి నానాజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారె సమర్పిస్తున్న ఆడపడుచులకు ఆయన అభినందనలు తెలియజేశారు. సారె కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొంతు రామారావు, సంసాని నాగరాజు, దొమ్మేటి బాలకృష్ణ, సంసాని ప్రకాష్ రావు, పొన్నమండ వీరబాబు తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తి గీతాలు, బోనాలతో వాతావరణం భక్తిపారవశ్యంతో