
జ నం న్యూస్- సెప్టెంబర్ 11- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ హిల్ కాలనీ పరిధిలోని పలు ప్రాంతాలను ఎక్సైజ్ శాఖ అధికారులు చెక్ పోస్ట్ కోసం స్థల పరిశీలన చేశారు, అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగే అక్రమ మద్యం రవాణ, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రొబేషనరీ ఎక్సైజ్ ఆఫీసర్ కిషన్ నాయక్ పేర్కొన్నారు. వాహనాల నిలుపుదలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఇందులో భాగంగా హిల్ కాలనీలోని కమర్షియల్ టాక్స్ పాత చెక్ పోస్ట్ భవనాన్ని పరిశీలించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా నిరంతరం సాగే వాహనాల తనిఖీలను మరింత కఠిన తరం చేసేందుకు ఆధునిక సదుపాయాలతో కూడిన చెక్ పోస్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రత్యేక ఎక్సైజ్ బృందాలను ఇక్కడ 24 గంటలు విధులలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎక్సైజ్ సీఐ కృష్ణ కాంత్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.