
జనం న్యూస్ -మే,29- నాగార్జునసాగర్ టౌన్- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శుక్రవారం నల్లగొండ జిల్లా పర్యాటక అధికారి మహమ్మద్ అక్బర్ అలీ సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పర్యాటక అభివృద్ధి లో భాగంగా నాగార్జునసాగర్ లోని పర్యటక ప్రాంతాలను ఆయన సందర్శించి పరిశీలించారు. దీనిలో భాగంగా బుద్ధవనం నాగార్జునసాగర్ డ్యాం ప్రధాన జిల్లా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎత్తిపోతల జలపాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాట కేంద్రమైన నాగార్జునసాగర్ లో టూరిజం పరంగా మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ద్వారా టూరిజం ఉన్నత అధికారులకు పంపుతున్నట్లుగా తెలిపారు. వీరితోపాటు స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.