
జనం న్యూస్ - జూన్ 9- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాగార్జునసాగర్ యూనిట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ పి ఎఫ్ నాగార్జునసాగర్ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ బి రాజు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్- 99 కార్యక్రమంలో భాగంగా ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డిఐజి మాధవరావు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ లోని ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కార్యాలయం, ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించుకునే బాధ్యత చేపడితే పర్యావరణ పరిరక్షణతో పాటు, జీవన మనుగడకు సహకారం అందించిన వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐలు రఘు, వెంకటేశ్వర్లు, ఏ ఎస్ ఐ లు పుల్లయ్య, రవీందర్,యూసుఫ్ లు తెలంగాణ జెన్కో,సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.