
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు: నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాగిరెడ్డిపల్లి సెక్రటరీ వెంక ట్రాముడు కి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.గ్రామంలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని మరియు చేతి పంపు మరమ్మత్తులను చేప ట్టాలని, కొత్త ఇళ్ల నిర్మా ణాలకు సంబంధించిన ప్లానింగ్ అను మతులు నిబంధనల ప్రకారం అమలు చేయాలని. గ్రామ పంచాయతీ పరిధిలో అన్యాక్రాంత మవు తున్న ప్రభుత్వ భూములను , వారసులు లేని భూములను గుర్తించాలని, కన్యకా చెరువు ప్రధాన కాలువకుండా జరిగిన అక్రమ కట్టడాలను గుర్తించాలని,అలాగే గ్రామంలో పారిశుధ్య సమస్యల పై అవగాహన సదస్సుల కార్యక్రమాలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా వీధుల్లో వీధి దీపాలు సమస్యలను,వీధుల్లో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, వర్షాకాలం మురికి నీరు నిలువల వల్ల దోమల తాకిడి నుండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వ హణను మెరుగుపరచడం, నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి కుళాయి కనెక్షన్ గుర్తించి తొలగించాలని, తాగు నీటి సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహ దారులలో మరియు నివాస ప్రాంతాలలో హల్ చల్ చేస్తున్న ఆవులు, కుక్కలు, పందులు మరియు కోతుల గుంపుల నుండి చిన్న పిల్లలను రైల్వే ప్రయాణికులను కాపాడాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోవాలని, గ్రామాభివృద్ధి కి సంబంధించిన సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని మండల కో ఆప్షన్ సభ్యులు కరిముల్లా ఖాన్ మరియు స్థానికులు కోరుతున్నారు.