
జనం న్యూస్ ఆగస్టు 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలలోనినాగేంద్రనగర్ గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.వివాహాలు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమా ల్లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లకు బదులుగా స్టీల్ గ్లాసులు, ప్లేట్లు వంటి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. కిరాణా, మటన్, చికెన్ తదితర దుకాణాల నిర్వాహకులకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ కవర్లలో వస్తువులు ఇవ్వకుండా సహకరించాలని కోరారు. ప్రజలు కూడా దుకాణాలకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే క్లాత్ బ్యాగులు లేదా పునర్వినియోగ సంచులు తీసుకెళ్లాలని సూచించారు.గ్రామంలోని దుకాణాలను గ్రామపంచాయతీ సిబ్బంది సందర్శించి ప్లాస్టిక్ నియంత్రణపై నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నియంత్రణ గ్రామపంచాయతీ ఒక్కదాని బాధ్యత కాదని, ప్రజలు, వ్యాపారులు సమష్టిగా సహకరించినప్పుడే నాగేంద్ర నగర్‌ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చగలమని తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై పంచాయతీకి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాకిర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.“ప్లాస్టిక్‌కు స్వస్తి.. పరిశుభ్రమైన నాగేంద్రనగర్‌కు శ్రీకారం” “మన గ్రామం.. మన బాధ్యత.. ప్లాస్టిక్ రహిత గ్రామం.. మనందరి లక్ష్యం”