
జనం న్యూస్ జూన్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 9 మెగా డీఎస్సీలు నిర్వహించి 2,16,179 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీని అత్యంత పారదర్శంగా నిర్వహించారని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా, ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి, ఎటువంటి అపోహలకు తావు లేకుండా, పరీక్ష ఫలితాలను పబ్లిక్ డొమెన్లో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ ఘనత దక్కుతుందని ఈరోజు తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వైసీపీ పాలనలో జగన్ ముఖ్యమంత్రిగా ఉపాధ్యాయులను వారు హక్కులను కాలరాశి, వారికి ఉన్న ప్రయోజనాలను తక్కువ చేసి, రివర్స్ పిఆర్సి ఇచ్చి , కరోనా సమయంలో లిక్కర్ షాపులు ముందు ఉపాధ్యాయులను డ్యూటీలు వేసి అవమానపరిచింది కాకుండా, పోరాడుతున్న ఉద్యమ సమయంలో హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ సమయంలో పోలీసులను స్కూలుకు, వారి ఇంటికి పంపి భయభ్రాంతులకు గురి చేసిన విషయం జగన్ రెడ్డి మరిచిపోయినట్లు ఉందని, జగన్ రెడ్డి ప్రకటించిన ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని, కూటమి ప్రకటించిన మెగాడీఎస్సీని నిర్వహించకుండా కోర్టులో 244 కేసులు వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడమే జగన్ రెడ్డి లక్ష్యం అని, డీఎస్సీలో పరీక్షలు రాసిన తనకు అన్యాయం జరిగినట్లుగా ఎక్కడ ఒక ఫిర్యాదు కూడా చేయలేదని, ఆ ప్రక్రియ ముగిసి ఏడాది కాలం తర్వాత, మేల్కొని తన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం వైసీపీ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ రెడ్డి ప్రయత్నాలు బెడిసి కొట్టాయని నాగ జగదీష్ అన్నారు. శ్రీభోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ మెగా డీఎస్సీ లో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు వారు కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగాలు మీద రాజకీయ వైరంతో వైసిపి నాయకులు ధర్నాలు ఉద్యమాలు చేయడం భావ్యం కాదని, ఉద్యోగులు పొందిన వారి వైసీపీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని విషయం మరిచిపోయి దీనిలో రాష్ట్రా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారని, వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడి కత్తి, గులకరాయి వంటివి తెలుగుదేశంపై విస్తృత ప్రచారం చేసి లబ్ధి పొందినట్లే మెగా డిఎస్సి పై కూడా విష ప్రచారం చేసినప్పటికీ ప్రజల్లో స్పందన లేకపోవడంతో వైసీపీ శ్రేణులు తోకముడిచారని, ఈ రెండు సంవత్సరాలు కాలంలో ఫేక్ ప్రచారాలతో పబ్బం గడుపుకున్నారని, వైసిపి నిర్మాణాత్మక మైన ప్రతిపక్ష పాత్ర పోషించ లేకపోయిందని, అటు అసెంబ్లీలో ఇటు బయట వైసీపీ నిర్వీరమైపోయిందని, నాగ జగదీష్ మండిపడ్డారు. కాశి ఇది ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగ సంక్షేమ సంఘం కార్యదర్శి బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.//