
జనం న్యూస్ మే 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసానికి పాల్పడిన కేసులో కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు మచ్చ సత్యనారాయణను శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే 2020 లో నమోదైన కేసులో నిందితుడు కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఎస్సై నిందితుడిని పట్టుకొని వారెంట్ ఎగ్జిక్యూషన్ చేసి పరకాల కోర్టులో ప్రవేశపెట్టారు ప్రిన్సిపాల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సాయి శరత్ నిందితుడు మచ్చ సత్యనారాయణకు 14 రోజులు రిమాండ్ విధించాగ పోలీసులు అతని సబ్ జైలుకు తరలించారు…