
జనం న్యూస్ 07 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముఖ్య మంత్రి ని అడ్డుకుంటామని ప్రకటించిన బి ఆర్ యస్ మరియు ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టు చేశారు ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని గద్వాల పర్యటనకు వస్తున్నారని ప్రాజెక్టుల పర్యటన విహార యాత్ర నా ఇప్పటివరకు ప్రభుత్వంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ప్రాజెక్టుల పురోగతి లేదని ఏ కాలువలో కనీసం పిచ్చి మొక్కలు తొలగించలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులను కడతామంటే ఎలా నమ్మాలని అన్నారు ముఖ్యంగా నెట్టెంపాడు ర్యాలంపాడు లో భాగమైన గట్టు ఎత్తిపోతల పథకం నత్తనడకన నడుస్తున్నదని ర్యాలంపాడు రిజర్వాయర్ ను సి పేజీని తగ్గించడానికి తీసుకున్న చర్యలు ఏవీ లేకపోవడం 400 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రకటనలు తప్ప పనులేమీ జరగలేదని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ దగ్గర ఏమి చూడడానికి వస్తున్నాడని ఉన్న మోటార్లకు ప్రారంభించలేని నాయకులు సందర్శన పేరుతో హడావిడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి పర్యటన వల్ల గద్వాల తాలూకాకు ఎటువంటి ఉపయోగం లేదని పర్యటనలు కాదు పనులు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి బంధించడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి పర్యటన నడిగడ్డకు ఏమి మేలు చేస్తుందో వేచి చూస్తామని ఎటువంటి హామీ లేకుండా పర్యటనలు ముగిస్తే అది ప్రజలకు ముఖ్యంగా నడిగడ్డకు ద్రోహం చేసినట్టు అని ముఖ్యమంత్రి నడిగడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని నడిగడ్డ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.