
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 08-07-26నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, నారాయణ రాజుపేట గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం అనుభవిస్తున్నదీనస్థితిచలించిపోయేలా చేస్తోంది. ఐదేళ్ల క్రితం తన భర్త ముక్కర రాజయ్య, మరణంతో ముక్కర వెంకటలక్ష్మి అనే మహిళ అనాథగా మారింది. నలుగురు ఆడపిల్లలను పెంచుకుంటూ, పూట గడవని పరిస్థితిలో, కడుపునిండా తిండి లేక, కనీస ఆధారం లేక ఆమె పడుతున్న వేదన వర్ణనాతీతం. భర్తను కోల్పోయిన బాధ ఒకవైపు, కన్నబిడ్డల ఆకలి కేకలు మరోవైపు ఆమెను నిత్యం వెంటాడుతున్నాయి.నిరాశ, నిస్పృహల మధ్య కాలం వెళ్లదీస్తున్న వెంకటలక్ష్మి దీనస్థితిని గుర్తించిన స్థానిక నాయకులు వెంటనే స్పందిం చారు. ఈ మానవీయ కార్య క్రమంలో భాగంగా రైల్వే కన్సల్టెంట్ మెంబర్ బిజెపినాయకులు, రాచూరి మురళి,వీరబల్లి జయ కుమార్ రెడ్డి , టిడిపి మైనారిటీ నాయకులుపఠాన్ మెహర్ ఖాన్ ఖాన్ ,పంబల శివ, టిడిపి నాయకులునరసింహులు ,తిరుపతి వెంకటరమణ, లు కలసి స్వయంగా వెంకటలక్ష్మి ఇంటికి చేరుకుని, ఆమె కుటుంబానికి రాబోయే రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరు కులను అందించారు.అధి కారుల దృష్టికి ఆమె సమస్య ను దృష్టికి తీసుకువెళ్లి కేవలం ఆర్థిక సహాయంతోనే సరిపెట్టకుండా, ఆమెకు ప్రభుత్వం నుండి రావాల్సిన వితంతు పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ మంజూరు అయ్యే వరకు ఆ కుటుంబానికి తాము అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం మన కనీస బాధ్యత. అధికార యంత్రాం గంపై ఒత్తిడి తెచ్చి, ఈ కుటుం బానికి శాశ్వత పెన్షన్ అందేలా చూస్తాం అని పేర్కొన్నారు.నాయకుల సత్వర స్పందన మానవత్వాన్ని చూసి నారాయణ రాజుపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన ఈ నాయకుల ఉదారత ఇతర రాజకీయ నాయ కులకు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులుకొనియాడారు.ఈ కార్యక్రమం లో రైల్వే కన్సుల్టేన్సీ మెంబెర్ రాచూరి మురళి, ఈ లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ప్రజలు కోరుకుంతున్నారు.