
జనం న్యూస్ నందలూరు కడప జిల్లానందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లి తోట పాలెం లో నివాసముంటున్న కుంచపు లక్ష్మీ నరసమ్మ స్థలము ను జంబు శశికళ ఆ స్థలమును ఆక్రమించి ఆ స్థలంలో బాత్రూము ప్రహరి గోడ నిర్మిం చారని కడప జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో ఈ స్థలం విషయమై అనేకసార్లు ప్రభుత్వ అధికారులు మండల రెవెన్యూ అధికారులను కలవగా ఎటువంటి న్యాయం జరగలేదని రాజంపేటలో తోట కన్వెన్షన్ హాల్లో జరిగిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు ప్రజల వద్దకే అధికారులు అనేటువంటి నినాదంతో తోట కన్వెన్షన్ సెంటర్లో భూ సమస్యల పరిష్కారం కోసం ఆరు మండ లాలకు సంబంధించి అధికారు లు ప్రజలు పాల్గొనమని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా జెసి ఆధ్వర్యంలో అర్జీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అందుకు జెసి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించి తొలగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఈ కార్యక్రమంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.