
జనం న్యూస్ 05 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలో విజయం సాధించాలనే సంకల్పంతో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఆయన సొంతంగా ఏర్పాటుచేసిన బి కే యం ఆర్ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ క్లాస్ లను బుధవారం గద్వాల పట్టణంలో వాసవి కమిటల్ లో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. పేద విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే బండ్ల ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల పేద విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బు లేక వెనకబడి పోకూడదనే ఉద్దేశంతోనే పూర్తి ఉచితంగా ఈ శిక్షణా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన ప్రకటించారు.