
జనం న్యూస్ 23 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; కేశంపేట మాజీ జెడ్పిటిసి తండ్రా విశాల శ్రావణ్ రెడ్డి డిమాండ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుల అరెస్టులకు నిరసనగా కేశంపేటలో కాంగ్రెస్ ధర్నా
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను అణచివేసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులు విద్యార్థులపై లాఠీచార్జ్‌ను నిరసిస్తూ కేశంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేశంపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుమగళ్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేశంపేట మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు రమేష్ లు విమర్శించారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించి ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు ఆదేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకమైన పరీక్షా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం తో పాటు విద్యార్థుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు