

బిచ్కుంద ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గబిచ్కుంద మండల కేంద్రంలో ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నియమితులైన 15 మంది నర్సులు , నలుగురు వైద్యులు, హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ కాళిదాస్ ను బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా సెట్కర్ సన్మానం చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సీమ సెట్కర్ మాట్లాడుతూమహారాష్ట్ర–కర్ణాటక–తెలంగాణ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు వైద్య సేవలు అందించే కేంద్రంగా బిచ్కుంద ఆసుపత్రిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సదుపాయాలను విస్తరించడం, అవసరమైన డాక్టర్లు సిబ్బందిని నియమింపజేయడం ఆయన అభివృద్ధి దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్,మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, కౌన్సిలర్ నౌషా నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగనాథ్,పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి, సర్పంచులు జై పటేల్, కాళోజి విట్టల్ గోపాల్ రెడ్డి పటేల్ సంతోష్ పటేల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీమ గంగారం సార్, కార్యకర్తలు మెడికల్ ఫార్మసీ శ్రీనివాస్ హాస్పటల్ సిబ్బంది మోహిన్ శివ తదితరులు పాల్గొన్నారు