
జనం న్యూస్ జూలై17( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్ ఇన్స్పెక్టర్గా నవీన్ చంద్ర, బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నవీన్ చంద్ర, మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకమైన, ప్రజామిత్ర పోలీసింగ్‌ను అమలు చేస్తానని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, ట్రాఫిక్ క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే నిర్భయంగా బీబీపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.