
జనం న్యూస్ జులై 21 వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి, పరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరాములతో కలిసి, బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మంజుల ఆధ్వర్యంలో గ్రామానికి మంజూరైన డ్వాక్రా భవనానికి భూమి పూజ చేశారు. పరిగి మండలంలో డ్వాక్రా భవనములు లేని గ్రామపంచాయతీలకు డ్వాక్రా భవనాలను మంజూరు చేయడం జరిగిందని, మంజూరైన గ్రామాల లో వెంటనే డోక్రా భవనముల పనులను ప్రారంభించాలని, లేనియెడల మంజూరైన భవనాలు రద్దు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నెలలోపు పనులు ప్రారంభించాలని పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రయ్య, బుగ్గన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు