
----- గ్రామ సభలో పాల్గొన్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజప్ప
జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీలో శుక్రవారం రోజు సర్పంచ్ శ్రీమతి వాగు మారే విజయ కుమారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది,ఎట్టి గ్రామసభ యందు 2026 27 కి సంబంధించి జిపిడిపి ప్లాన్ తయారీపై మరియు హర్ ఘర్ జల్ యోజన పథకంపై గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ప్రతిరోజు పరిశుభ్రమైన మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని గ్రామసభ యందు పాల్గొన్న జుక్కల్ మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజప్ప తెలపడం జరిగింది , మరియు ఇతర సమస్యలు ఉన్న లీకేజెస్ గాని నూతన మోటర్ పైప్ గాని వెంటనే గ్రామపంచాయతీలో పరిష్కరిస్తున్నారని ఇట్టి సమావేశంలో తెలిపినారు, ఇట్టికార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పాలకవర్గం సభ్యులు గ్రామస్థాయి అధికారులు మిషన్ భగీరథ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది