
జనం న్యూస్:* ఆగస్టు 8 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో దక్షిణ భారత విమానాశ్రయాల సంస్థ ప్రాంతీయ ఆపరేషన్ అధిపతి పూసర్ల శివప్రసాద్ రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించారు.సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మురళీమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సేవలో కూడా కీర్తి గడించారు. కళ, సాహిత్యం, సామాజిక సేవల్లో ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం పట్ల శివ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.