
జనం న్యూస్ జూన్ 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గం, పరిగి పట్టణంలో జూన్ 3 తారీకు బుధవారం రోజున 10 గంటలకు ఎన్ కే కన్వెన్షన్ హాల్లోకేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు (బి ఎల్ ఎ )లు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ ) నియమించిన ప్రత్యేక ట్రైనర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి బి ఎల్ ఎ ల శిక్షణ కార్యక్రమాన్ని పరిగి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు.ఈ శిక్షణ శిబిరంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు, బి ఎల్ ఎ ల బాధ్యతలు, పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.అందువల్ల పరిగి నియోజకవర్గంలోని 305 బూత్‌లకు చెందిన కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఎ లు అందరూ తప్పనిసరిగా హాజరై ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి కోరారు.