
జనం న్యూస్ 24 ఆగస్టు :- వికారాబాద్ జిల్లా పరిగి మండల నూతన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీగా రాపోలు గండు వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామీద నమ్మకంతో మండల కాంగ్రెస్ పార్టీ కమిటీలో జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు అప్పగించినందుకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారికి, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు, PACS వైస్ చైర్మన్ బద్రి గారి రాజపుల్లారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ నాయకుల ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. మండల కమిటీలో తనకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గండు వెంకటేష్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.