
జనం న్యూస్ - జూన్ 5 - నాగార్జునసాగర్ టౌన్-పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకారం అందించాలని నాగార్జునసాగర్ అటవీ డివిజన్ అధికారి సంగీత అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అటవీ డివిజన్ నెల్లికల్ అర్బన్ పార్కు పరిధిలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఉత్సవాలలో భాగంగా జూన్ 1 నుండి జూన్ 12వ తేదీ వరకు సాగర్ అటవీ డివిజన్ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నిమ్మా నాయక్ తండ సర్పంచ్ బాబు నాయక్, సెక్షన్ ఆఫీసర్ రమేష్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.