
జనం న్యూస్ 05జూన్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని పలు గ్రామాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెగడపల్లి మండలంలోని నామపూర్, నరసింహునిపేట, అయితుపల్లి, మ్యాకవేంకాయపల్లి, నందగిరి గ్రామ పంచాయతీ లలో క్రింది 7 అంశాలపై ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించడం జరిగినది.ప్రత్యేక గ్రామ సభ : అంశాలు1. వర్షాకాలం సన్నద్దత 2. సురక్షిత తాగునీరు 3. ఘన వ్యర్థముల నిర్వహణ 4. జల సంరక్షణ - మన సంరక్షణ5. మొక్కలు పెంపకం - వన మహోత్సవము6. వరద నిర్వహన - భద్రత7. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఈ కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇ. ప్రేమ్ సాగర్, మండల పంచాయతీ అధికారి పి. శశి కుమార్ రెడ్డి , సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.