
జనం న్యూస్ సెప్టెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామంలో బుధవారం ‘ఇంటింటికి రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పిటిసి సభ్యులు, టీడీపీ పల్లంకురు గ్రామ కమిటీ అధ్యక్షులు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా చైతన్య యాత్రలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం సాధించిన రెండేళ్ల పాలనా ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ఇసుకపట్ల వెంకటేశ్వరరావుతో పాటు కాట్రేనికోన మండల టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు బడుగు పుల్లారావు, పల్లంకుర్రు నీటి సంఘం అధ్యక్షులు ఇసుకపట్ల వెంకటరమణ, ముఖ్య నాయకులు ఇసుకపట్ల చక్రవర్తి, ఇసుకపట్ల గోవిందు, ఇతర కూటమి నేతలు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.