
జనం న్యూస్ జూన్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించామని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కృష్ణ అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించామని మొత్తం మండలంలో 20 బూతుల ను ఏర్పాటుచేసి ఒక మొబైల్ టీం మండలం మొత్తం 3851 మంది పిల్లలకు గాను 3796 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం నుండి మంగళవారం రోజు వరకూ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అలాగే వేసుకొని పిల్లలకి ఇంటింటికి వెళ్లి వేయని పిల్లలను గుర్తించి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ప్రారంభించారు అని మెడికల్ ఆఫీసర్ సాయికృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ చల్లపతి వైద్య సిబ్బంది, ఎమ్మెల్. హెచ్. పి. డాక్టర్స్, సూపర్వైజర్స్, ఎ. ఎన్. ఎం. ఎస్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, పాల్గొనడం జరిగినదని తెలియజేశారు......