
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలంలోని పాటూరులో ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాలక్ష్మి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వ హించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈనెల 21న విగ్రహ ప్రతిష్ట లో భాగంగా దీక్ష హోమం,అగ్నిప్రతిష్ట ,మూలమంత్ర ఆపాదులు ప్రత్యేక పూజలు, 22వ తేదీన ఆవాహిత పూజలు, గ్రామోత్సవము, హోమాలు, 23వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వ హించనున్నట్లు ఎల్లమరాజు శ్రీనివాసరాజు తెలియజేశారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.