
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 21-05-26 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి లో ఉన్న శ్రీ అన్నమాచార్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థిని తుమ్మాది గాయత్రి తన తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు ఇన్వర్టర్ను బహుమతిగా అందజేశారు. 2023-24 విద్యాసంవత్సరంలో పదోతరగతి లో 600కు 574 మార్కులు సాధించిన గాయత్రి, అనంతరం ఇంటర్మీడియట్లో 1000కు 989 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. పాఠశాలపై ఉన్న అభిమానంతో విద్యార్థుల సౌకర్యార్థం ఇన్వర్టర్ను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిని గాయత్రి తాను చదివిన పాఠశాలపై అభిమానం తో,సేవాభావంతో ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు. పాఠశాలకు ఇన్వర్టర్ను అంద జేసిన గాయత్రి కుటుంబ సభ్యులకు పాఠశాల ప్రధానో పాధ్యాయుడు ఏనుగుల బాలాంజనేయులు ,డైరెక్టర్లు మాడపూరి హేమలత, సమ్మెట ఉమా మహేష్ ఉపాధ్యాయులు ధన్యవాదములు తెలిపారు.