

జనం న్యూస్ 12 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఎంవీ ఫౌండేషన్ మొబిలైజర్స్ ఆధ్వర్యంలో గట్టు మండలం ఆరగిద్ద ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్ వదన్ మరియు ఎంవీ ఫౌండేషన్ మొబిలైజర్స్ ఆధ్వర్యంలో ఆదివారం పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకాని విద్యార్థులను తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ఈరోజు ఇంటింటి సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఏమి ఫౌండేషన్ మొబిలైజర్స్ విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థుల విద్యాభ్యాసం మధ్యలో ఆగిపోకుండా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి బాలుడు బడిలో ఉండాలి- ప్రతి బాలుడు చదువులో ముందుండాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్ వదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఎండి రఫీ ఎంవి ఫౌండేషన్ మొబిలైజర్స్ వి శాంతి ఫాతిమా వీణ సిఆర్పి శ్రీధర్ గ్రామ యూత్ పాల్గొన్నారు