
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) రైతుల ఆరోగ్య పరిరక్షణకు స్వాగతించదగిన నిర్ణయం: నాగిరెడ్డి సతీష్ రావుపారాక్వాట్ అనే విషపూరిత గడ్డి మందు వినియోగాన్ని నిషేధించే దిశగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ముసాయిదా ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారాక్వాట్ అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందులలో ఒకటని తెలిపారు. దీని వినియోగం వలన రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంతో పాటు పర్యావరణం, నేల సారంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.రైతుల సంక్షేమం, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభినందనీయమని పేర్కొన్నారు.శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సురక్షిత ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని రైతులకు పిలుపునిచ్చారు.రైతుల ఆరోగ్యం కాపాడేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు స్వాగతించాలని ఆయన కోరారు.