
జనం న్యూస్ జూలై 17: నిజామాబాద్ జిల్లా : ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరం పావని ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను ఉపసర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ శుక్రవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలువురు ఉపసర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు, ఉపసర్పంచ్లతో కలిసి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.అనంతరం ఉపసర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఇస్సాపల్లి మహేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఆశీరెడ్డి హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉపసర్పంచ్ ఫోరం తరఫున రూ.31 వేల ఆర్థిక సహాయాన్ని పావని కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా బోట్ల కార్తీక్ మాట్లాడుతూ, పావని కుటుంబానికి ఉపసర్పంచ్లందరూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పావని భర్త భాను పిల్లలను మంచిగా చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇస్సాపల్లి మహేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, మండల అధ్యక్షులు ఆశీరెడ్డి హన్మంత్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, సామా శ్రీనివాస్ రెడ్డి, శశిధర్, వసంత్ రావు నాయక్, ఇస్సాపల్లి రాజు, కేతిరెడ్డి నర్సారెడ్డి, ఉపసర్పంచ్లు చాట్ల జనార్దన్, సున్నపు శ్రీనివాస్ ముదిరాజ్, లోలపు రాజు, బొల్లపల్లి సుమన్ గౌడ్, ద్యాగ ప్రసాద్, అమృ నాయక్, అఖిల్ నాయక్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.