
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఆగస్టు 14-08-2026 శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరులో శ్రావణమాసం వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవతలందరికీ ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో ఆలయాల్లో అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అందులో భాగంగా పెబ్బేరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో మొదటి శుక్రవారం అమ్మవారు భక్తులకు విశేషంగా పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కిట్టు స్వామి ఉదయాన్నే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మంగళహారతితో నీరాజనం ఇచ్చారు. అనంతరం ఆర్యవైశ్యులు తెచ్చిన పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆర్యవైశ్య మహిళలు, యువతులు చిన్నమ్మవారికి వివిధ రకాల పూలతో కనుల విందుగా అలంకరణ చేశారు. సాయంత్రం మహిళి భక్తులు పూలతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. లలితా సహస్రం, వాసవి మాతా పారాయణాలు చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఆలయంలో పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి మహా మంగళహారితో నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ, ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దాతలు కొండూరు రంజిత్, రాజేశ్వరి దంపతులు, వారి సంతానం అనుదీప్, భాను శ్రీలు అల్పాహారాన్ని వితరణ చేశారు.