
జనం న్యూస్, జూలై 13,అచ్యుతాపురం :అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం లోగల ఉప్పుటేరు పై అక్రమంగా నిర్మించిన కల్వర్టును వెంటనే తొలగించాలని స్థానికులు ఉప్పుటేరు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా బీసీవై పార్టీ మత్స్యకార నాయకులు మేరుగు నూకరాజు మాట్లాడుతూ పూడిమడక గ్రామ పంచాయతీ రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 51, 52,53,54 లో సుమారు 38 ఎకరాలతో పాటు సర్వే నంబర్లు 82, 83ల్లో మరికొంత భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ అనుమతులు లేకుండాప్రభుత్వ భూమిలో నుండి లేఅవుట్ కోసం 40 అడుగుల వెడల్పుతో రోడ్డు వేశారని,సర్వే నెంబర్ 50-2లో పోరంబోకు భూమిలో కల్వర్టు నిర్మించిన వారికి అచ్యుతాపురం తహసీల్దార్ జూన్ 25న అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారం రోజుల్లోగా తెలియజేయాలని నోటీసు జారీ చేశారని,కల్వర్టు పై ఇప్పటివరకు ఏ విధంగానూ చర్యలు తీసుకోలేదని,తక్షణమే కల్వర్టును తొలగించి పూడిమడకలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై సంబంధిత అధికారులు విచారణ జరిపి ప్రభుత్వ భూమిని అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకుని అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్యకార యువకులు కోవిరి కాసుబాబు, మేరుగు అచ్చిబాబు, మహేష్, కోదండరావు, కృష్ణ, రమణ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
