
జనం న్యూస్ జూలై 14, వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో పూడూరు మండలంలోని అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో అమలవుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే, దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సమస్యలను ప్రాధాన్యతగా పరిగణించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల రఘునాథ్ రెడ్డి , పిఎసిఎస్ వైస్ చైర్మన్ సురేందర్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.