
జనం న్యూస్ జులై 2 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని పెద్దఉమెంతల గ్రామంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తల్లిపాలు ప్రకృతి ఇచ్చిన వరమని ప్రసవం అయిన గంటలోపే తల్లిపాలు పట్టించినట్లయితే చిగురుపాలలో కలస్ట్రం అనే పదార్థం ఉంటుంది అందుకే తప్పనిసరిగా తల్లిపాలు తాపాలని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తల్లిపాలు రెండు సంవత్సరముల వరకు ఇవ్వచ్చు బిడ్డ ఆరోగ్య పరిస్థితిలో కూడా తల్లిపాలకు ఇవ్వాలి, తల్లి పాలలో విటమిన్ ఏ, డి, విటమిన్ లు సమృద్ధిగా ఉంటుందని తల్లిపాలలో అన్ని పోషక పదార్థాలు ఉంటాయని ముఖ్యంగా తల్లిపాలు తాగడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఒక రొమ్ము మొత్తం పాలు తాగిన తర్వాత ఇంకో రొమ్ము బిడ్డకు ఇవ్వాలని తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు మంచిదని అన్నారు.బిడ్డకు ఏడు నెలల తర్వాత అనుసంధాన ఆహారాన్ని అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పల్లె దవాఖాన డాక్టర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్, సెక్రెటరీ,అంగన్వాడి టీచర్ సరళ, ఆయాలు అనూష, అనిఫా,వినోద, తల్లులు, తదితరులు పాల్గొన్నారు